హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కేబినెట్ లో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. చాలా అంశాల్లో తమిళిసైది వితండవాదమని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రులు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది..