రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ
ఆంద్రప్రదేశ్: ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీని సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నూతన జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానికి సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీకి సీఎంవో అపాయింట్మెంట్ కోరింది..