Telugu Updates
Logo
Natyam ad

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాధం నెలకొంది. సోమవారం ఉదయం బాలీవుడ్ లో ప్రముఖ నటుడు, రచయిత శివ కుమార్ సుబ్రమణ్యం మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన గతేడాది ‘మీనాక్షి సుందరేశ్వర్’ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించింది. నెటెఫ్లెక్ష్ లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. విధు వినోద్ చోప్రా చిత్రం ‘పరిందా’, సుధీర్ మిశ్రా చిత్రం ‘హజారోన్ ఖ్వైషీన్ ఐసీ’ చిత్రాలకు ఆయన స్క్రీన్ప్లే రాశారు. వీటితో పాటు 2 స్టేట్స్, తీన్ పట్టి, ప్రహార్, రాణి ముఖర్జీ నటించిన హిచ్కీ చిత్రాలలో సహాయ నటుడి పాత్రలు పోషించారు. కాగా శివకుమార్ మృతికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు. ఆయన కొడుకు జహాన్ బ్రెయిన్ ట్యూమర్తో 2 నెలల క్రితమే చనిపోయాడు. శివ కుమార్ మృతి పట్ల చిత్ర నిర్మాత బీనా సర్వర్ సంతాపం తెలిపారు. ట్విట్టర్ లో నివాళులర్పించారు..