Telugu Updates
Logo
Natyam ad

చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసం

మంచిర్యాల జిల్లా కు చెందిన తండ్రీకొడుకు కలిసి బోగస్ కంపెనీ

దాదాపు రూ.2 కోట్లు వసూలు, తండ్రీకొడుకులు అరెస్టు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ బోగస్ చిట్ ఫండ్ కంపెనీ భాగోతం బయటపడింది. ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి సమతామూర్తి ఫొటోలు కార్యాలయంలో పెట్టుకొని కంపెనీ వారిదే అన్నట్లు నమ్మించి దాదాపు రూ. 2 కోట్లు వసూలు చేసి పారిపోయారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రీకొడుకు కలిసి బోగస్ కంపెనీ ఏర్పాటుచేయడం గమన్హారం. మాదాపూర్ ఠాణా ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన ఏల్పుల శ్రీనివాస్(47) అతని కుమారుడు రాకేశ్ వర్మ (27) కొంతకాలం క్రితం నగరానికి వచ్చారు. ఉప్పల్లోని ఈశ్వర హైట్స్ అపార్టుమెంట్ లో ఉంటూ మంచిర్యాలకు చెందిన గణేశ్ అనే వ్యక్తితో కలిసి 2023 ఏప్రిల్లో మాదాపూర్ గుట్టల బేగంపేట్ లో సమతామూర్తి చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ముగ్గురూ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ మార్కెటింగ్ ఏజెంట్లు, టెలీకాలర్లను నియమించుకొని రూ. లక్ష నుంచి కోటి వరకు చిట్ వేయవచ్చని, కావాల్సిన సమయంలో ఎత్తుకోవచ్చని మాయమాటలు చెప్పించారు. కార్యాలయంలో చినజీయర్ స్వామి, సమతామూర్తి చిత్రాలు పెట్టి కంపెనీ స్వామివారిదే అన్నట్లు నమ్మించారు. మాదాపూర్ తో పాటు ఎల్బీనగర్, కూకట్ పల్లిలో శాఖలు తెరిచారు. దాదాపు 130 మంది చిట్టీలు కట్టారు. ఆరునెలలపాటు డబ్బులు కట్టించుకున్నాక చిట్టీ పాడుకున్నవారికి చెల్లించకుండా కాలయాపన చేశారు. అక్టోబర్ లో పాడుకున్న వారికి జనవరి వరకు ఇవ్వలేదు. డబ్బులివ్వాలని అడిగినవారికి ఇచ్చిన చెట్లు సైతం బౌన్స్ అయ్యాయి. అనుమానంతో వినియోగదారులు నిర్వాహకులను నిలదీయడంతో వారు కనిపించకుండా పోయారు.