బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ..?
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్ జిల్లాలో అత్యధికంగా 43.99 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది..