Telugu Updates
Logo
Natyam ad

పట్టపగలే దారుణం… కళ్ళలో కారం చల్లి..?

కళ్ళలో కారం కొట్టి మెడలోని గొలుసు లాక్కెళ్ళిన దొంగ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్: పట్టపగలే దారుణం జరిగింది.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్ళలో కారం కొట్టి గొలుసు లాక్కెళ్ళిన అగంతకుడు. కాగజ్నగర్ పట్టణంలోని ఓల్డ్ కాలనీలో నివసిస్తున్న పూదరి శారద (60) ఒంటరిగా ఉండటం గమనించిన అగంతకుడు మద్యాహ్నం ఇంటిలోకి చొరబడిన ఒక్కసారిగా వృద్దురాలి కళ్ళలో కారం చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు, పుస్తెలను లాక్కుని పారిపోయాడు. దాదాపుగా రెండున్నర తులాల బంగారం ఉంటుందని బాధితురాలు తెలిపింది. వృద్ధురాలి అరుపులు విన్న కోడలు వచ్చేసరికి దొంగ పారిపోయాడు. దీంతో కాలనీ వాసులు వెంటనే 100 కు డయల్ చేసారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్, ఎస్ఐ అంజనేయులు, శ్రీకాంత్, సోనియా, రాజ్యలక్ష్మిలు చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి టీవీ చూస్తుండగా అగంతకుడు ఇంటిలోకి వచ్చినట్టు వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో దొంగను పట్టుకుంటామని సీఐ రవీందర్ తెలిపారు..