Telugu Updates
Logo
Natyam ad

రోడ్డు ప్రమాదానికి కారణమై తప్పించుకు తిరుగుతున్న లారీ డ్రైవర్ అరెస్ట్..!

మంచిర్యాల జిల్లా: ఈ నెల 12న జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివారులో ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో హెచ్కెర్ఆర్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ యార్డు వద్ద యాక్సిడెంట్ చేసి ఒకరి మరణానికి కారణమై తప్పించుకు తిరుగుతున్న ఛత్తీస్ ఘడ్ చెందిన డ్రైవర్ ను పోలీసులు మంగళవారం లారీతో సహా చాకచక్యంగా పట్టుకున్నారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు తన భార్య గౌతమి, కొడుకు వేదాంత్ తో కలిసి రామకృష్ణాపూర్ బీజోన్ లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి రాత్రి తిరిగి వెళ్తుండగా రాత్రి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. డ్రైవర్ లారీని ఆపకుండా పారిపోగా ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి రెండు వారాలుగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వివిధ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ క్రమంలో ఇందారం ఎక్స్ రోడ్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదం చేసిన లారీ ఛత్తీస్ ఘడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన లారీగా గుర్తించారు. లారీ నెంబర్ ఆధారంగా అడ్రస్ తెలుసుకొని ఉన్నత అధికారులు అనుమతితో రెండు బృందాలు చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి వెళ్లి ప్రమాదానికి కారకుడై తప్పించుకొని తిరుగుతున్న లారీ డ్రైవర్ శివ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకొని, ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన జైపూర్ ఎస్సై రామకృష్ణ, అదనపు ఎస్సై గంగరాజు గౌడ్, హెడ్ కానిస్టేబుళ్లు ఇజాజ్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, భాస్కర్ లను సీపీ చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ అభినందించారు.