Telugu Updates
Logo
Natyam ad

పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు

కొమురం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువులను రవాణా చేసే అవకాశం ఉన్నందున, పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.