కరోనా ఫోర్త్ వేవ్..రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం..
ధిల్లీ: మళ్లీ కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కొత్త రూపం దాల్చింది. స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూసి కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది. స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్సీడీసీ చీఫ్, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, డీబీటీ సెక్రెటరీ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా మూడింటిపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్ఫెక్షన్ పెరుగుదల.. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ అధికారులను సూచించారు..