Telugu Updates
Logo
Natyam ad

కరోనా ఇంకా అంతరించిపోలేదు: మోదీ

అప్రమత్తంగా ఉండాలని సూచించిన భారత ప్రధాని

అహ్మదాబాద్: కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుకే కరోనాపై చేస్తోన్న పోరులో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదన్నారు. ఇటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామన్న ఆయన.. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అయితే, అత్యంత వేగంగా సంక్రమించే సామర్థ్యమున్నట్లు భావిస్తోన్న ‘ఎక్స్’ వేరియంట్ గుజరాత్ లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి అప్రమత్తం చేశారు..