మంచిర్యాల జిల్లా: తమ్ముడు చనిపోయాడన్న వార్త విని అన్న గుండె కూడా ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గాజుల భాస్కర్డ్ గుండెపోటుతో చనిపోవడంతో మృతదేహాన్ని లక్షెట్టిపేట తీసుకొచ్చారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి అన్న శ్రీనివాస్ గౌడ్ కూడా కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఒకేరోజు అన్నదమ్ములు కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది..