Telugu Updates
Logo
Natyam ad

పెన్షన్ పేరుతో బిపిఎమ్ ల స్కామ్ లు

పెన్షన్ పేరుతో బిపిఎమ్ ల స్కామ్ లు

అందిన కాడికి దండుకుంటున్న బీపీఎం లు 

పట్టించుకోని సంబంధిత అధికారులు

వృద్ధాప్య పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం!

ఆంజనేయులు న్యూస్ ప్రతినిది, శశికిరణ్ ఇంగు

తెలంగాణ: రాష్ట్రంలో వృద్దులకు ప్రతి నెల ప్రభుత్వం తరపున వచ్చే ఆసరా పెన్షన్ లని ఆసరాగా తీసుకొని ఆదాయం చేసుకుంటున్న కొందరు బిపిఎం లు గట్టిగా ప్రశ్నిస్తే కాని తిరిగి ఇవ్వని వైనం. పెన్షన్ కోసం వృద్ధులు పడుతున్న కష్టం ఇంత అంత కాదు పెన్షన్ సొమ్ము కావాలి అంటే బిపిఎం ల చుట్టూ రోజులు తరబడి తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటి అంటే పోయిన నెల పెన్షన్ కేవలం 3 రోజులే ఇవ్వడంతో కొందరికి సమాచారం లేకుండా పెన్షన్ నగదు ఈ నెల జమతో వచ్చిన 2 నెలల మొత్తం ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒక నెల పెన్షన్ డబ్బులు ఇచ్చి బుక్ లో మాత్రం రెండు నెలలు ఇచ్చినట్టుగా ముద్రించి ఇస్తున్నారని. సంబంధిత అధికారులు విషయం తెలిసి కూడా చూసి చూడనట్టు పట్టించుకోవడంలేదని వృద్ధాప్య పెన్షన్ దారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు బిపిఎం లను వెళ్లి అడగగా బ్యాంక్ నుండి తీసుకుని వచ్చిన నగదు అయిపోయాయి ఈ రోజే తీసుకుని వచ్చాను అని కప్పి పుచ్చుకొని బిత్తిరి పోయే సమాధానాలు చెబుతున్నారని స్థానిక ప్రజలు, వృద్ధ పెన్షన్ దారులు వాపోతున్నారు. తెలియని వారి దగ్గర దొరికిన కాడికి బిపిఎం లు దండుకుంటున్నారని, వృధాప్యంలో పెన్షన్ సమస్యల కోసం ఎవరికి చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నమని పెన్షన్ దారులు తెలిపారు.. ఈ బిపిఎం లు ఉన్నంత కాలం మాకు తిప్పలు తప్పేటట్టు లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవలని, పెన్షన్ పేరుతో మోసాలకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంమే పెన్షన్ దారుల కష్టాలు గుర్తించి మీరు అందించే ప్రతి రూపాయి పెన్షన్ దారుల బ్యాంక్ సేవింగ్ ఖాతాకి జమ చేయాల్సిందిగా పెన్షన్ దారులు కోరుతున్నారు.