Telugu Updates
Logo
Natyam ad

భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’..!

హైదరాబాద్: శాసనసభ నుంచి తమను సస్పెండ్ చేసిన అంశంలో హైకోర్టు సూచనను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు చేపట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ప్రారంభమైంది. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ తో పాటు ఆ పార్టీ నేతలు దీక్షకు దిగారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఎమ్మెల్యేల దీక్ష నేపథ్యంలో పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు ఇందిరాపార్కు వద్దకు చేరుకున్నారు.. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు..