Telugu Updates
Logo
Natyam ad

బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా అమిరిశెట్టి రాజ్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం  జిల్లా నాయకుల సమక్షంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బద్దం లింగారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా అమిరిశెట్టి రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు.. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బద్దం లింగారెడ్డి కి, నా యొక్క ఎన్నికకు సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ కి ధన్యవాదాలు తెలుపుతూ.. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి యువమోర్చాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ మంచిర్యాల యువమోర్చా పట్టణ అధ్యక్షునిగా, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా తదనంతరం రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన నన్ను నా యొక్క సేవలను పార్టీ గుర్తించి మంచిర్యాల పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సాధారణ కార్యకర్తకు సైతం పదవులు వస్తాయనడానికి తనే నిదర్శనమన్నారు.

జిల్లాలో పట్టణంలో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన విజయవంతం చేస్తామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేవరకు పోరాడుతామన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన కృషి చేస్తానన్నారు. కార్యకర్తలే తనకు బలమని అలాంటివారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అర్థరాత్రి సైతం సంప్రదించవచ్చన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను పట్టణ అధ్యక్షుడిగా నియమించిన జిల్లా, రాష్ట్ర, అధ్యక్షులు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపుతున్నట్లు పేర్కొన్నారు.