Telugu Updates
Logo
Natyam ad

భాజపా ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు..?

హైదరాబాద్: భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారనే ఆరోపణలపై ఐపీసీ 223(a) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాను వీడియో బయట పెట్టిన తర్వాతే దోషులు బయటకు వస్తున్నారంటూ రఘునందన్ రావు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయడం గమనార్హం.