మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా: గర్భిణుల ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రులలోనే జరిగే విధంగా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ రతి హోళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా వైద్య, రోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులు, గైనకాలజిస్టులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు ఇంటి వద్ద కాకుండా ఖచ్చితంగా ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగే విధంగా సంబంధిత ఖల అధికారులు జిల్లాలో పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, సాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలోని గర్భిణుల వివరాలను 84 రోజుల లోపు నమోదు చేయించాలని, మం తప్పకుండా నిర్వహించవలసిన పరీక్షలను తప్పనిసరిగా చేయించాలని తెలిపారు. ఎం.సి.పి. కార్డులలో గర్భిణుల వరాలు నమోదు చేయించాలని, హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. 102 అమ్మ ఒడి అంబులెన్స్ను నియోగించి గర్భిణులను పరీక్షలు, ప్రసవాల కొరకు ఆసుపత్రులు తరలించాలని, గర్భిణులతో పాటు ఆశ కార్యకర్తలను “సుపత్రిలోకి అనుమతించాలని, ప్రసవ తేదీని స్కానింగ్ ద్వారా నిర్ణయించాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు, శ కార్యకర్తలతో ఆసుపత్రి సిబ్బంది స్నేహపూర్వకంగా మెలిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సాధారణ సవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సిజిరేయన్ ప్రసవాలను పూర్తిగా తగ్గించాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సవానికి ఉపయోగపడే యోగాసనాల శిక్షణ ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం కావడంతో రవాణా సౌకర్యాలు లేని సొంతాలలోని గర్భిణులను గుర్తించి వారికి అత్యవసర వైద్య సేవలు సమయానికి అందే విధంగా అవసరమైన కార్యచరణ పొందించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి డా॥ నిర్మల, ప్రభుత్వ సుపత్రి పర్యవేక్షకులు డా॥ హరిశ్చంద్రరెడ్డి, డా॥ అరవింద్, ప్రోగ్రామ్ అధికారులు డా॥ నీరజ, డా॥ అనిత, డా॥ ఫయాజ్, ద్యాధికారులు, జిల్లా ఆసుపత్రి, మాతా శిశు వైద్యశాల గైనకాలజిస్టులు, నవజాత శిశు పిల్లల వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..