Telugu Updates
Logo
Natyam ad

వేసవిలో పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

మంచిర్యాల జిల్లా: ఎండాకాలంలో పక్షుల దాహార్తిని తీర్చి, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్ కార్యక్రమ కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన స్వగృహంలో పక్షుల ఆకలి తీర్చేందుకు మట్టి పాత్రలో నీరు, మరో పాత్రలో ధాన్యపు గింజలు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక ఎన్నో పక్షులు మరణిస్తుంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పక్షి జాతి అంతరించి పోకుండా రెండు మట్టి పాత్రలలో నీరు, ఆహారపు గింజలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టిఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు రవీందర్ రావు, దబ్బేట రామన్న, తాజ్, పానుగంటి శ్రీనివాస్, జూపాక సుదీర్, సుదమల్ల అశోక్ తేజ, చేరల వంశీ, తదితరులు పాల్గొన్నారు..