భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేటరూరల్: మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేశంపేట పిఎసిఏస్ పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని కాకునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కాకునూర్ గ్రామ సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గండ్ర జగదిశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… ఇఫ్తార్- ఎ- దావత్ (ఇఫ్తార్ విందు ) భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు.ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు.ఈ సందర్భంగా పలువురు ముస్లింలకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు.అనంతరం ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.