Telugu Updates
Logo
Natyam ad

శభాష్.. పోలీస్..?

పోగొట్టుకున్న బ్యాగ్ ను గంట వ్యవధిలో వెతికి పెట్టిన మంచిర్యాల పోలీస్

మంచిర్యాల జిల్లా: మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతం లో జార్ఖండ్ లోని హజరిబాగ్ జిల్లా కు చెందిన కపిల్ దేవ్ అనే యువకుడు పని కోసం కరీంనగర్ లోని బావుపేటకు  వెళ్లుటకు మంచిర్యాల బస్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తూ ఉన్న సమయం లో అతని బ్యాగ్ పోగొట్టుకున్నాడు. అందులో 3000/- రూపాయలు, ATM కార్డులు , విలువైన వస్తువులు ఉన్నాయని  మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లి తన సమస్య చెప్పగా వెంట స్పందించిన మంచిర్యాల ఇన్స్పెక్టర్ నారాయణ, ఎస్ఐ హరిశేఖర్, HG సుధాకర్ మరియు బ్లూకోల్ట్ (BC 2) చెందిన PC’s  రమేష్, రాజశేఖర్ లతో అలర్ట్ చేయగా వారు గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న బ్యాగును వెతికి పట్టుకుని బాదితునికి అప్పగించినారు.

బ్యాగు లో 3000/- రూపాయలు మరియు పోగొట్టుకున్న  విలువైన వస్తువులు అన్ని ఉండడంతో బాదితుడు ఆనందం వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించిన మంచిర్యాల పోలీస్ లకు తెలంగాణ పోలీస్ శాఖ కి కృతఙ్ఞతలుధన్యవాదములు తెలపడం జరిగింది. త్వరగా స్పందించి బ్యాగ్ ను వెతికి పట్టుకున్నందుకు సిబ్బందిని మంచిర్యాల సిఐ నారయణ అభింధించారు..