Telugu Updates
Logo
Natyam ad

బీట్రూట్, దానిమ్మ జ్యూస్ తో ఎన్నో లాభాలు.!

ఆంజనేయులు న్యూస్: చాలా మంది జిమ్ లో వ్యాయామం చేస్తుంటారు. ఈ క్రమంలో రెడీమేడ్ ఇన్స్టంట్ ఎనర్జీ డ్రింక్ లపై ఎనలేని మక్కువ చూపుతుంటారు. అయితే అవి శరీరానికి ఎంతో చేటు చేస్తాయి. వాటికి బదులు బీట్రూట్, దానిమ్మ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎంతో శక్తిని వెంటనే శరీరానికి చేకూర్చుతుంది. ఇందులో అలసిన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, బీ6, విటమిన్ సి, విటమిన్ కె మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు తగిన స్థాయిలో ఉంటాయి.