మంచిర్యాల జిల్లా: ప్రజలకు న్యాయం చేకూరేలా వారి హక్కులకు భంగం కలగకుండా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూచించారు. శనివారం సిసిసిలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జరిగిన జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి, ఓర్పు, సహనం కలిగి పనిచేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ రంగ వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, అదే స్పూర్తిని ఇతర శాఖలు కొనసాగించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..
