Telugu Updates
Logo
Natyam ad

హాస్టల్లో బీర్లు బిర్యానీలు.. వైరల్ గా సెల్ఫీలు..?

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలోని కొందరు విద్యార్థులు బీర్లు, బిర్యానీలతో విందు చేసుకున్నారు. అంతే కాకుండా బీర్లు తాగుతూ దిగిన సెల్ఫీలు దిగడంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ అధికారి బుధవారం విచారణకు ఆదేశించారు. ప్రముఖ వెబ్సైట్ ప్రకారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. స్థానిక విద్యార్థుల సాయంతో బీరు బాటిళ్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారులకు వాట్సాప్ తోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్ మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్ను సందర్శించి వార్డెన్ మల్లేశ్తో పాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు.