బంగారు తెలంగాణ వైపుగా అడుగులు
రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట: బంగారు తెలంగాణ వైపుగా అభివృద్ధి అడుగులు పడుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మహబూబ్నగర్ ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాకునూరు లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, ఎక్లాస్ఖంపేట-దర్గా ,సంగెం-దర్గా రీబీటీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్ ,జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ,సర్పంచులు లక్ష్మమ్మ ,కవిత యాదవ్, తలసాని వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్ ,సింగిల్విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, మధుసూదన్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు..