Telugu Updates
Logo
Natyam ad

ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు: బండి సంజయ్

సెంటిమెంట్ రాజేయడంలో కేసీఆర్ ముందుంటారు: బండి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారంటూ తెరాస దుష్ప్రచారం. చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఓట్లు, ఇతర పార్టీల నాయకులను కొనడం <span;>విమర్శించారు. ఓట్లు, ఇతర పార్టీల నాయకులను కొనడం తప్ప ధాన్యం కొనే స్థితిలో కేసీఆర్ లేరని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు సమస్యను మరింత జటిలం చేసేలా కేసీఆర్ వైఖరి ఉందని బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలు ఆడటంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని… సెంటిమెంట్ రాజేయడంలో ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. రాష్ట్ర రైతులతో కేసీఆర్.. రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. “ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులను ఢిల్లీకి పంపితే ఏమైనా న్యాయం జరిగిందా? తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారా..? అలా అని ఉంటే మేమైతే నిలదీసే వాళ్లం. మరి తెరాస మంత్రులెందుకు కేంద్ర మంత్రిని నిలదీయలేదు? రైతాంగాన్ని గౌరవించే వ్యక్తి పీయూష్ గోయల్. భేటీ ముగిసిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన రాష్ట్ర మంత్రులు కొత్త కరం నాటకాలు మొదలుపెట్టారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వను అని స్వయంగా సీఎం కేసీఆర్ సంతకం చేసి ప్రకటించారు. ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు. <span;>ఓట్లు కొంటున్నారు.. సీట్లు కొంటున్నారు.. మరి వడ్లు కొనరా? సమస్య పరిష్కారం కావాలా.. లేక కొట్లాట కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.