ఆంజనేయులు న్యూస్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పి మీ వాళ్లతో కోర్టులో పిటిషన్లు వేయించి ప్రతిపక్షాల పైన నెపం నెడతావేమో ‘ఊరుకోం’ అంటూ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలగించిన విద్యావలంటీర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, 22 వేల స్కావెంజర్ లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేవైఎం మిలియన్ మార్చ్ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తున్నారని అన్నారు. బంగాళాఖాతంలో బీజేపీని కలిపేస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ని, టీఆర్ఎస్ పార్టీని మూసీ నదిలో కలిపేస్తామని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకున్న 25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ సర్కార్ ను విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటనలను నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బిశ్వాల్ కమిటీ నివేదిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రపంచ గోల్మాల్ సంఘం అధ్యక్షుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బీజేపీ మీద నిందలు వేయడానికి సీఎం కేసీఆర్ రెడీ గా ఉంటారని, మమ్మల్ని మతపిచ్చిగాళ్ళు అంటారా అంటూ మండిపడ్డారు. మేం హిందూ ధర్మం కోసం ప్రాణం ఇచ్చేంత మత పిచ్చి గాళ్ళమే అని బండి సంజయ్ పేర్కొన్నారు..