హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నిర్వాకంతో 27 మంది ఇంటర్ విద్యార్థులు మృతిచెందారంటూ బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేసిన ట్విట్ కు కేటీఆర్ కౌంటరిచ్చారు. తనపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ నిరూపించాలని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఆరోపణలు నిరూపించక పోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించారు..