Telugu Updates
Logo
Natyam ad

బీ1, బీ2 వీసాల ఇంటర్వ్యూలు..!

హైదరాబాద్: అమెరికాలో పర్యటించేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన బీ1, బీ2 టూరిజం, విజిట్, బిజినెస్ వీసాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు అమెరికా కాన్సులేట్ అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ నుంచి బీ1, బీ2 వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించారు. తొలిసారి బీ1, బీ2 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే, త్వరలోనే ఈ వీసాల కోసం స్లాట్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో బీ1, బీ2, ఇతర వీసాల రెన్యువల్ కు ఇంటర్వ్యూలు మినహాయింపు ఇచ్చి డ్రాప్ బాక్స్ సౌకర్యం కల్పించారు. కానీ గతంలో కొవిడు ముందు స్లాట్స్ బుక్ చేసుకున్న బీ1, బీ2 వీసాలకు సంబంధించిన రీషెడ్యూల్ అంశంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..