సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి జిల్లా: యాధాద్రీ లో బీబీ నగర్ టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్, వరంగలకు చెందిన ఖలీల్ గా గుర్తించారు. వీరిద్దరూ గుడిమల్కాపూర్ లో ఓ వ్యాపారి దగ్గర పూలు తీసుకొని ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వరంగల్ కు వెళ్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే మార్గంలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమాదాన్ని చూసి ఘటనాస్థలిలో ఆగారు. వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి అక్కడే నిలబడి సహాయక చర్యలను పర్యవేక్షించారు..