Telugu Updates
Logo
Natyam ad

ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!

ఆస్పత్రిలో చేర్పించిన బ్లూకోర్ట్ పోలీసులు సత్యనారాయణ, తిరుపతి,

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలో  స్థానిక బైపాస్ రోడ్డులోని అమర వీరుల స్తూపం వద్ద ఒడ్డెర కాలనీకి చెందిన రామిళ్ల అశోక్ అనే ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అశోక్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన స్థానికులు 100 డైల్ కాల్ చేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న బ్లూకోర్టు పోలీసులు సత్యనారాయణ, తిరుపతి పురుగుల మందుతాగి పడిపోయిన అశోక్ ను108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమించ డంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు..

అశోక్ ను ఆస్పత్రికి తరలిస్తున్న బ్లూకోర్టు సిబ్బంది అశోక్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై అతడి భార్య రవళిని వివరణ కోరగా అశోక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీంతో తరుచుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నా యని తెలిపింది..