మంచిర్యాల జిల్లా: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపల్లి గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం సిసిసి నస్పూర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ ఉన్న ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.6, 230 నగదు, పేకాట ముక్కలు, 3 ఆటోలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జాడి బానేష్, మార్కాపూరి శ్రీనివాస్, బోపు శేఖర్, పెద్దిరాజు వివేక్, బోడకుంట రాజమొగిలి, శాతం రాజు ఉన్నారు. సాయి, జాడి సతీష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ టాస్క్ లో ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు ఎఎస్సై జితేందర్, సత్తయ్య, పీసీలు రవి, రాజబాబు పాల్గొన్నారు.