Telugu Updates
Logo
Natyam ad

సైబర్ మోసానికి గురైన బాధితునికి తిరిగి డబ్బులు అప్పగింత

మంచిర్యాల జిల్లా: సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి రామగుండం సైబర్ క్రైమ్, మంచిర్యాల పోలీసులు రూ. 3.10 లక్షలు తిరిగి ఇప్పించారు. గత నెల 26న పట్టణంలోని గౌతమి నగర్ కు చెందిన సాగి మురళిదర్ రావు అనే రిటైర్డ్ ఇంజనీర్ కు కేవైసి అప్డేట్ కోసం సైబర్ నేరగాడు మెసేజ్ పంపాడు. దానిని నమ్మి సైబర్ నేరగాడు చెప్పినట్టు అకౌంట్ డీటెయిల్స్ చేయగా తన బ్యాంక్ నుండి 3.10 లక్షలు గల్లంతయ్యాయి. వెంటనే బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా వారి ఆదేశాల మేరకు తక్షణమే స్పందించి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రామగుండం సైబర్ సెల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డబ్బులను నేరస్తుని ఖాతాలో నిలిపివేసి బాధితునికి మూడు రోజుల్లో డబ్బులు తిరిగి ఇప్పించినట్లు మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితునికి న్యాయం చేయడంలో చురుకుగా వ్యవహరించిన మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ కోటేష్ లను ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ అభినందించారు..