ఆసిఫాబాద్ లో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన
పి.ఎ.టు మినిస్టర్ సతీష్ బండారి
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీ రాజ్, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జిల్లాలో పర్యటించనున్నట్లు పి. ఎ. టు మినిస్టర్ సతీష్ బండారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీ ఉదయం 8.15 గంటలకు రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చ్ కొరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 9 గంటలకు ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ గ్రామంలో బాల సదన్, వాంకిడి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాల నుండి జూనియర్ కళాశాలకు అప్గ్రేడ్ చేసేందుకు శంకుస్థాపన, ఆదర్శ అంగన్వాడీ కేంద్రం ఆవిష్కరణ, జనకాపూర్ లోని సబ్ జైల్ జంక్షన్ లో రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొని 10.40 గంటలకు జోడేఘాట్ లో పర్యాటక శాఖ ప్రాజెక్టుల శంకుస్థాపన, మధ్యాహ్నం 12.10 గంటలకు కెరమెరి మండలం కోట పరందోలి గ్రామంలోని జంగుబాయి ఆలయం, జాతర సందర్శన కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.