మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసి అంబేద్కర్ స్మారక సంఘం అధ్యక్షుడిగా తగరపు దేవకుమార్ ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తూ సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు..