Telugu Updates
Logo
Natyam ad

మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదు: పవన్

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన (Janasena) పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో పవన్ మాట్లాడారు. “జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదు. మీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం” అని పవన్ కల్యాణ్ అన్నారు..