Telugu Updates
Logo
Natyam ad

చిరుత మాంసంతో విందు.. నిందితుల అరెస్ట.

పశ్చిమ బెంగాల్: చిరుతను వేటాడి ఆ మాంసంతో ముగ్గురు దుండగులు విందు చేసుకున్నారు. అంతేకాదు.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని శిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. చిరుతను వేటాడిన ఫొటో నిందితులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం. వల్ల ఆ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు 15 రోజుల తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు ముకేశ్ కేకెట్టా, పితలుష్ కేర్ కెట్టాలను అరెస్ట్ చేసి.. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుల వద్ద చిరుత గోళ్లు లభించలేదని.. దీనిపై మరింత దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు..