Telugu Updates
Logo
Natyam ad

ఏపీలో ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు..!

అమరావతి: ఏపీలో ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తితిదే ఈవోగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ.. యువజన సర్వీసులు శాఖ కమిషనర్ గా శారదా దేవిగా నియమించారు. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఉన్న నాగరాణిని రిలీవ్ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్చ్ సీఈవో ఇంతియాజ్ ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు..