Telugu Updates
Logo
Natyam ad

ధోబీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..?

మన దేశంలో చాలా మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు..

వారికి గుర్తింపు, శిక్షణ లభించడం లేదు: మహీంద్రా

ఆంజనేయులు న్యూస్: వంపులు తిరిగిన సన్నని రోడ్డు.. తలపై పెద్ద దుస్తుల మూటతో ఓ వ్యక్తి సైకిల్ ను స్పీడ్ గా తొక్కుతున్నాడు. కానీ అతడి చేతులు సైకిల్ హ్యాండిల్ పై లేవు.. తలపై ఉన్న మూటను రెండు చేతులతో పట్టుకొని హ్యాండిల్ ను పూర్తిగా వదిలేసి అతడు సైకిల్ ను నడుపుతున్న తీరు సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఎలాంటి తడబాటు లేకుండా.. సైకిల్ ను నియంత్రిస్తూ రోడ్డు వంపులను అలవోకగా దాటుకుంటూ వెళ్లే ఆ ధోబీ తీరు నెటిజన్లను అబ్బరపరుస్తోంది. ఆ సైకిల్ వెనకే కారులో వెళ్లే మరో వ్యక్తి ఈ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కాగా ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో నిత్యం  చురుగ్గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. దీంతో ఆయన ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి.. ఆ ధోబీపై ప్రశంసలు కురిపించారు. తలపై భారీ మూటతో వ్యాండిల్ ను పట్టుకోకుండా సైకిల్ ను అతడు నియంత్రిస్తున్న విధానానికి ముగ్ధుడయ్యారు. అతడి శరీరంలో జైరోస్కోప్ (చక్రం లేదా డిస్క్ తో కూడిన పరికరం) ఉందా! అంటూ ఆశ్చర్యపోయారు. ‘ఈ వ్యక్తి దేహంలో జైరోస్కోప్ ఉందా! అతడు మానవ సెగ్వే. సైకిల్ ను అతడు నియంత్రిస్తున్న విధానం అద్వితీయం. అయినప్పటికీ, నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే.. మన దేశంలో అతనిలాంటి చాలా మంది ప్రతిభావంతులైన జిమ్నాస్ట్ క్రీడాకారులు ఉన్నారు. కానీ వారికి గుర్తింపు, శిక్షణ లభించడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. మహీంద్రా పంచుకున్న ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ ధోబీ ప్రతిభను అనేకమంది మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 6. 7లక్షల మంది వీక్షించారు..