Telugu Updates
Logo
Natyam ad

పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పశువులు అనారోగ్యానికి గురైతే సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1962ను ఏర్పాటు చేశారు. తొలి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించనున్నారు. ఇందుకుగానూ రూ.143కోట్లతో 175 పశువుల అంబులెన్స్లను కొనుగోలు చేశారు. రెండో దశలో రూ.135 కోట్లతో మరో 165 అంబులెన్స్లను కొనుగోలు చేయనున్నారు. వాహనాల్లో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసే ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.