Telugu Updates
Logo
Natyam ad

విద్యాసంస్థల కేటాయింపులో కేంద్రం, రాష్ట్రానికి మొండిచేయి

విద్యాసంస్థల కేటాయింపుల్లో తెలంగాణ ఊసే లేదు: కేటీఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. విద్యాసంస్థల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని ఇవాళ ట్విటర్ లో మండిపడ్డారు. మోదీ సర్కారు ఏడు ఐఏఎంలను దేశవ్యాప్తంగా మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు రిక్తహస్తం చూపిందన్నారు. ఏడు ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కకపోవడం శోచనీయమన్నారు. మిగతా విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్ఐటీలు 4, మెడికల్ కళాశాలలు 157, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ తెలంగాణకు చోటు ఇవ్వలేదని తెలిపారు.

రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం హామీని విస్మరించారన్న మంత్రి.. తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిథిగా గుజరాతు తరలిపోయిందన్నారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు..