Telugu Updates
Logo
mobile after logo

ఉగ్ర కుట్ర పై అలర్టైన పోలీస్ యంత్రాంగం..!

ఆదిలాబాద్ జిల్లా: బోథ్, ఇచ్చోడ మండలంలోని సిరిచేల్మ రోడ్డు, వంతెనల కింద తనిఖీలు చేస్తున్న డాగ్ స్క్వాడ్స్ సిబ్బంది. ఇటీవల మధ్య ప్రదేశ్ లోని బస్తర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకొన్న ఉగ్రవాదుల విచారించగా విద్వంసానికి సంభందించిన మందుగుండు సామగ్రి, ఆయుధాలు ఆదిలాబాద్ జిల్లా కు తరలిస్తున్నట్లు ఉగ్రవాదులు విచారణ లో తెలపడం తోపాటు లొకేషన్ తనఖి లో వెల్లడికావడం తో జిల్లావ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై తనిఖీలు, విచారణలతో పాటు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్స్ టీం. లను రంగంలోకి దింపింది ప్రధాన రహాదారులకు ఇరువైపులు, తనఖి లు చేస్తున్నారు. వంతెనల కింద డాగ్ స్క్వాడ్ లతో పరిశీలిస్తున్నారు. శనివారం ఇచ్చోడ మండలంలోని సిరిచేల్మ, సిరికొండ గ్రామాలకు వెళ్లే రహదారులు, వంతెనలు తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తుల రాక పోకలు, కదలికలపై నిఘా పెట్టారు..

Post bottom