Telugu Updates
Logo
Natyam ad

పోషణ పక్షంలో భాగంగా అక్షరాభ్యాసం..?

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసి- 3 అంగన్ వాడి కేంద్రంలో బుధవారం పోషణ పక్షంలో భాగంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అంగన్ వాడి టీచర్ ఎన్. పద్మ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్ వాడి కేంద్రంలో అందిస్తున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి కేంద్రం సహాయకురాలు లత పాల్గొన్నారు.