Telugu Updates
Logo
Natyam ad

అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

మంచిర్యాల జిల్లా: అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం ఆర్కే 5 సిహెచ్పీ సమీపంలో నస్పూర్ పోలీసులు పట్టుకున్నారు. సిసిసి, నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి పోలీస్ స్టేషన్ల పరిధిలోని చుట్టప్రక్కల గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారనే నమ్మ సమాచారం మేరకు తనిఖీలు చేసి రూ. 3, 40 లక్షలు విలువ చేసే 17 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిలో జెంగిలి శ్రీనివాస్, కక్కెర్ల నాగరాజు, దుబాయ్ శ్రీనివాస్, వీరేశం ఉన్నారు. ఈ టాస్క్ లో మంచిర్యాల రూరల్ సీఐ సంజవ్, సిసిసి నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు..