అక్రమ లే అవుట్లపై తూ తూ మంత్రం చర్య లేనా.?
ఫ్లెక్సీలను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు
మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలో అక్రమంగా వెలుస్తున్న లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని గతంలో స్థానిక బీజేపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయగా, ఎట్టకేలకు స్పందించిన అధికారులు తాండూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లే అవుట్ల వద్ద, నిన్న ఈ లే అవుట్లకు అనుమతులు లేనందున, గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు రావని, ఎలాంటి సౌకర్యాలు కల్పించబడవని కావున ప్రజలు ఇలాంటి అక్రమ లే అవుట్లలోని ప్లాట్లు కొని మోసపోవద్దని పేర్కొంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటలు గడవక ముందే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్లెక్సీలను తొలగించారు. మండలంలో వెలుస్తున్న అక్రమ లే అవుట్లపై అధికారులు తూతూ మంత్రం చర్యలతో విడిచిపెట్టకుండా, అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు అంటగట్టి వారిని మోసం చేస్తూ మరియు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగజేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున అధికారులను డిమాండ్ చేస్తున్నారు..