Telugu Updates
Logo
Natyam ad

కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల నిరసన..

మంచిర్యాల జిల్లా: అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ లో ఏవో సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయని నమ్మించి డిపాజిటర్ల పేర్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో దాదాపు రూ. 5 వేల కోట్లు వసూలు చేసి కొన్ని కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా 2015లో చేతులెత్తేయగా, అరెస్ట్ లతో ప్రభుత్వాలు చేతులు దులుపుకు న్నాయని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సభ్యులు జీవన్, దేవరాజ్, సుధాకర్, రవి, కమల సతీష్, రామారావు, అరవింద్, మోహన్, శ్రీనివాస్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.