Telugu Updates
Logo
Natyam ad

అడుగడుగున బ్రహ్మరథం.. బండి సంజయ్ యాత్రకు ఘన స్వాగతం

బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సహం…మండల ప్రజలలో నయా జోష్.

టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బండి సంజయ్.

రంగారెడ్డి జిల్లా, కేశంపేట రూరల్:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది.ఇందులో భాగంగా మంగళవారం కేశంపేట మండలంలోని తొమ్మిది రేకుల గ్రామంలో పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు అందే బాబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బండి సంజయ్ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై మీడియా ద్వారా మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేసి సాధించుకుంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం కుటుంబ పాలన వశం అయ్యిందని మండిపడ్డారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ద్రోహులతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాడని విరుచుకుపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా యువతను అణగదోక్కాలని చేస్తున్నాడాని ఆగ్రహించాడు.ఒకవైపు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తుంటే కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరూ పదవులు అనుభవిస్తూన్నారని హెద్దేవా చేశారు.కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తు చేశారు. గడిలా పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరారు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్.

రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం తెలపడం జరిగింది.స్వాగతంపట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది…