జిల్లా కలెక్టర్ రాజార్షి షా
నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించిన అధికారులు
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర లో శుక్రవారం నాగోబా దర్బార్ ను జిల్లా కలెక్టర్ రాజా రాజార్షి షా ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ ఆలంలు, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి ఆదిశేషునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొమురంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, మెస్రం వంశీయులు బస చేసిన గోవడ్, భక్తులకు కల్పించిన వసతులను, వారు తయారు చేస్తున్న వంటలను పరిశీలించారు. నాగోబా దర్బార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొని మాట్లాడుతూ.. నాగోబా దర్బార్ లో ఆర్జీదారులు తమ సమస్యల పై దరఖాస్తులను సమర్పించుటకు ఆన్ని శాఖలకు సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అర్జీలను అర్జీదారులు సంబంధిత అధికారులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
గతంలో స్వీకరించిన దరఖాస్తుల సమస్యలను ఐటీడీఏ పీవో తో కలసి పరిష్కరించడం జరిగిందనీ, ఇంతకుముందు కమిటి సభ్యులు కొన్ని సమస్యలను చెప్పడం జరిగిందనీ, వాటి పరిష్కారానికి కృషి చేసి సత్వరమే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.
ఐటీడీఏ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఆన్ని ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర ఏర్పాటు చేయడం జరిగిందని, ఆరోగ్య పాఠశాల కు శ్రీకారం చుట్టి విద్యార్థుల్లో అవగాహనను కల్పించడం జరుగుతుందని అన్నారు. భారత దేశంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతర విశిష్టత పై దేశ నలుమూలల తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలని, మెస్రం వంశీయుల కట్టుబాట్లు, సంస్క్రుతి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆన్నారు. తొలిసారి 1942లో నిర్వహించిన దర్బార్ హేమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో జరిగిందని, నాగోబా జాతర సందర్భంగా ఈ సారి నాగోబా సన్నిధిలో నిర్వహించే దర్భారు కు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79 లోకి అడుగుపెడుతున్నదని ఆన్నారు. ఈ దర్బార్ లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను విన్నవించి అధికారుల ద్వారా వారి వినతులు పరిష్కారం అయ్యేవని ఆసియాలో 2 వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోందన్నారు. గత మూడు రోజుల నుండి నాగోబా జాతరకు భక్తుల రద్దీ ఎక్కువగా పెరుగుతుందని, నాగోబ జాతరలో దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
దర్బార్ లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా నిన్న సాయంత్రం గురువారం మొదటిసారి గా కళ ప్రదర్శన నిర్వహించడం జరిగిందనీ, కేస్లాపూర్ లోని నాగోబా జాతర లో దర్బార్ రోజున కళ ప్రదర్శన ప్రతీ సారి నిర్వహించడం , ఈసారి ప్రభుత్వం నాగోబా జాతర దర్బార్ కంటే ముందు గురువారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం మొదటి సారిగా నిర్వహించడం, అందులో హైదారాబాద్ టీం కళాకారులతో పాటుగా జిల్లా స్థాయి కళాకారులు పలు గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం, డ్యాన్స్ లు చేయడం అందరి చూపరులను ఆకట్టుకుని, విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎస్పీ కాజల్, ఎఫ్డిఓ రేవంత్ చంద్ర, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్ , ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.