Telugu Updates
Logo
Natyam ad

ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ… వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం.

విద్యాతోనే జీవితంలో ఏదైనా సాధ్యం.

ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలి

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మేము ఉన్నాం మీకోసం అంటూ భరోసా కల్పిస్తూ అందరితో సహపంక్తి భోజనం చేసిన పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోణి నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసువారి ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారం తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం లో భాగంగా పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించి ఆదివాసీ గిరిజన కుటుంబాలకు దుప్పట్ట్లు, నిత్య అవసర సరుకుల, వంట సామాగ్రి, చీరలు, దోతులు, లుంగీల పంపిణి  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ హాజరైనారు. వారిని ప్రజలు వారి సంప్రదాయ డప్పు వాయిద్యాలతో సంప్రదాయం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ.. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ హాస్టల్స్ కలవు అందులో చేర్పించి చదివించాలి. సెలువుల లో ఇంటికి వస్తే వారిని సెలవుల అనంతరం మళ్ళీ తిరిగి హాస్టల్ లకు తప్పక పంపించాలి అప్పుడే వారు మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తారు ఉన్నత స్థాయిలో ఉంటారు.

గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తమ పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని, గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి కృషిచేయాలని సూచించారు. గిరిజనులను    విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడడానికి పోలీస్ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది అని తెలిపారు.  ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేర వేయడానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సంసిద్ధంగా ఉందని అన్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు  నడిచేలా ప్రోత్సహిస్తారు  కావున  వారి ప్రలోభాలకు  లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా  పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని  వారు  పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని అభివృద్ధివైపు అదివాసులు దృష్టిసారించాలని మారుమూల గ్రామాలను సందర్శించి ప్రజలకు మరింత చైతన్య పరచాలని తెలిపారు.

ముఖ్యంగా ఆదివాసి గిరిజన గ్రామాల్లో పర్యటించాలని, స్థానిక సమస్యలను తెలుసుకోని, వెంటనే పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు.  ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు వివరించి నట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ఇతర ప్రభుత్వ శాఖ ల సమన్వయం తో సమస్యల పరిష్కారం కు కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, తాండూర్ సీఐ కుమార్ స్వామి, మాదారం ఎస్ఐ సౌజన్య, తాండూర్ ఎస్ఐ కిరణ్, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,ప్రజలు, కుల పెద్దలు పాల్గొన్నారు.