పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
ఎస్పీ రంగప్రవేశంతో అదుపులోకి వచ్చిన గొడవలు
ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు ఎంతగా సముదాయించడానికి యత్నించిన వినకపోవడంతో చివరకు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దింతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు మహమ్మద్ ప్రవక్త ను కించపరుస్తూ పోస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని సదరు యువకున్ని పట్టుకొని కొందరు ముస్లింలు చితకబాదారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ముస్లింలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత సముదాయించినా వినకపో గా పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకొని వెళ్లారు. చివరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నంచిన ఫలితం లేకుండా పొయింది.
ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.. పోలీసుల పైపైకి రావడంతో పరిస్థితి చేయిదాటే తరుణంలో పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. పెద్ద ఎత్తున గుమిగూడిన అందర్నీ పోలీసులు చెదరగొట్టారు. దీంతో పరిస్థితి కాస్త అదుపులో కి వచ్చింది. మొత్తనికి ఆదిలాబాద్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. రాత్రి సమయంలో ఎవ్వరిని రోడ్లపై కి రానివ్వడం లేదు..