Telugu Updates
Logo
Natyam ad

రూరల్ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: భజరంగ్ దళ్, బీజేపి నాయకులు శుక్రవారం కొమురం భీం జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ను కలిసి కాగజ్నగర్ రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శివ గౌడ్, కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ. ఓ ఆలయం వివాధంలో హిందూ దేవుళ్ళను, పూజారిని దూషించిన సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వెంటనే చర్యలు తీసుకోని యెడల రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.