Telugu Updates
Logo
Natyam ad

మంచిర్యాల సబ్ డివిజన్ నేర సమీక్ష సమావేశం..

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల సబ్ డివిజన్ నేర సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఏసీపీ సాధన రష్మి పెరుమాళ్ నిర్వహించిన ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న నేరాలపై సమీక్షించారు. అనంతరం నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఎసిపి వివరించారు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులు పెండింగులో లేకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించాలని తెలిపారు..